
నవ తెలంగాణ-గోవిందరావుపేట :
మచ్చాపూర్ బీఆర్ఎస్, పార్టీ ముఖ్య కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగజ్యోతి గెలుపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పనిచేయాలని బీఆర్ఎస్ మండల కమిటీ అధ్యక్షుడు సురపనేని సాయికుమార్ అన్నారు. శుక్రవారం మండలంలోని మచ్చాపురం గ్రామంలో గ్రామ కమిటీ అధ్యక్షుడు వంగరి ప్రభాకర్ అధ్యక్షతన బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా సాయికుమార్ హాజరై మాట్లాడారు. గత పది సంవత్సరాల కాలంలో అభివృద్ధి కార్యక్రమాలను సంక్షేమ పథకాలను గడపగడపకు తీసుకువెళ్లి ప్రతి ఒక్కరికి వివరించి ఓట్లు అభ్యర్థించి గెలిపి లక్ష్యంగా ముందుకు సాగిపోవాలని పిలుపునిచ్చారు. ఎంపీపీ సూడి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ భారీ మెజారిటీతో నాగజ్యోతి గెలుపు ఖాయమని అన్నారు. ఆశయం బలంగా ఉండి సంకల్పం మంచిది అయ్యి చిత్తశుద్ధితో ప్రజలకు సేవ చేయాలని చూసే నాయకురాలు ఓడిపోయినట్లు చరిత్రలో లేదని ములుగు చరిత్రలో బడే నాగజ్యోతి కి ఓటమి అంటూ ఉండదని అతి విశ్వాసంతో చెప్తున్న మాట కాదు. ఆత్మవిశ్వాసంతో అభిమానంతో చెప్తున్న మాట అని అన్నారు. రైతుబంధు మండల కమిటీ అధ్యక్షులు పిన్నింటి మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ నాగజ్యోతి గెలుపే ప్రధాన కర్తవ్యం గా కార్యకర్తలు అభిమానులు కృషి చేయాలని కోరారు. గెలుపు ఖాయం లక్ష్యంగా తీసుకొని ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని వారు పిలుపునిచ్చారు. తెలంగాణలో ఎగిరేది గులాబీ జెండా మాత్రమేనని ములుగు గడ్డపై నాగజ్యోతి అధిక మెజార్టీ తో విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు, తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను మేనిఫెస్టోను ప్రతి ఇంటికి ప్రతి ఓటరుకు చేరవేసి చైతన్యపరచాలని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీలోకి చాగంటి సాగర్ ను పార్టీ జెండా కప్పి ఆహ్వానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మచ్చాపూర్ సర్పంచ్ రేగూరి రవీందర్ రెడ్డి, లకావత్ నరసింహ నాయక్ గోవిందరావుపేట ప్రధాన కార్యదర్శి, పృథ్వీరాజ్ ఉట్ల గోవిందరావుపేట మీడియా అండ్ సోషల్ మీడియా కోఆర్డినేటర్, తలసిల ప్రసాద్ సమన్యాయ సమితి సభ్యులు, గోవిందరావుపేట మాజీ సర్పంచ్ భూక్య దేవా నాయక్, బుర్ర సురేందర్ సమన్వయ సమితి సభ్యులు, డాక్టర్ హేమాద్రి సీనియర్ నాయకులు, చల్వాయి సర్పంచ్ ఈసం సమ్మయ్య, అధికార ప్రతినిధి బూరేటి మధు, సీనియర్ నాయకులు ఉట్ల మోహన్, అల్వాల కనకయ్య, పిఎసిఎస్ డైరెక్టర్ దూడపాక రాజేందర్, వార్డ్ నెంబర్ లేoకల రమేష్, మండల నాయకులు గుమ్మడి ప్రసాద్, మచ్చాపూర్ గ్రామం ప్రధాన కార్యదర్శి కుమ్మరి కుంట్ల చిన్నస్వామి, గ్రామ రైతు కోఆర్డినేటర్ గుమ్మడి ప్రవీణ్, మచ్చాపూర్ గ్రామం కో ఆప్షన్ నెంబర్ పున్నం అజయ్ కుమార్, ముడతనపల్లి చంద్రమౌళి, లెoకల రాజయ్య, కుమ్మరి కుంట్ల మహేందర్, ఎజ్జు కొమురయ్య గ్రామ ఉపాధ్యక్షులు సతీష్, మచ్చాపూర్ యూత్ అధ్యక్షులు నేరటి రమేష్, గండి రమేష్ మచ్చాపూర్ మాజీ యూత్ అధ్యక్షులు, మచ్చాపూర్ యూత్ మెంబర్ తేజావత్ సూరణ్ సింగ్, కె కృష్ణ, సతీష్, సంజీవ, చాగంటి సాగర్, ఏపూరి మల్లారెడ్డి, రేవంత్, సుద్దాల రాజు, రాపోలు సుధాకర్, భూక్య సంతోష్, దరిపెళ్లి మురళీ మనోహర్, అల్వాల శ్రీనివాస్, గ్రామ ముఖ్య నాయకులు బూత్ ఇన్చార్జీలు 100 ఓట్ల ఇన్చార్జీలు బూత్ ఏజెంట్లు సీనియర్ నాయకులు గ్రామ నాయకులు పార్టీ కుటుంబ సభ్యులు సైనికులాంటి కార్యకర్తలు ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు.