– పూర్తి భాద్యతలు డీఓ గా బాలక్రిష్ణ..
నవతెలంగాణ – అశ్వారావుపేట
ఆయిల్ ఫెడ్ లో అంతర్గత బదిలీలు,పదోన్నతుల్లో భాగంగా అశ్వారావుపేట పామాయిల్ పరిశ్రమ మేనేజర్ గా మంద నాగబాబు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు ఈయన ఇదే పరిశ్రమలో అదనపు మేనేజర్ గా విధులు నిర్వహించారు. ఇప్పటి వరకు మేనేజర్ గా ఉన్న బాలక్రిష్ణ డివిజనల్ అధికారిగా అదనపు విధులు నిర్వహించారు. ఇకనుండి పరిశ్రమ పుల్ ఛార్జ్ మేనేజర్ నాగబాబు వ్యవహరించనున్నారు. పూర్తి కాలం డివిజనల్ మేనేజర్ తో పాటు కల్లూరి గూడెం లో నిర్మించబోయే పరిశ్రమ కార్యకలాపాలను బాలక్రిష్ణ పర్యవేక్షిస్తారు.