
– కాటాపూర్ లో బూత్ కమిటీల సమావేశం
నవతెలంగాణ- తాడ్వాయి : ప్రజల కోసం ప్రాణాలర్పించిన ఉద్యమ నేత బడే ప్రభాకర్ అన్న బిడ్డ, ములుగు బిఆర్ఎస్ అభ్యర్థి బడే నాగజ్యోతిని అధిక మెజార్టీతో గెలిపించాలని టి ఎస్ ఆర్ డి సి చైర్మన్, బీఆర్ఎస్ పార్టీ నాలుగు మండలాల ఇన్చార్జి మెట్టు శ్రీనివాస్ అన్నారు. సోమవారం మండలంలోని కాటాపూర్ లో 9 గ్రామాల బూత్ స్థాయి సమావేశం లో ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతోనే రాష్ట్రం సుభిక్షంగా ఉందని మళ్లీ గెలిపించుకుంటేనే మరింత అభివృద్ధి జరుగుతుందని ఆయన అన్నారు. ఏటూరునాగరం, ములుగు ఏజెన్సీలో పేద దళిత బహుజనుల కోసం తాడిత పీడిత ప్రజల కోసం ప్రాణాలర్పించిన బడి ప్రభాకర్ అన్న బిడ్డ నాగజ్యోతిని సీఎం కేసీఆర్ ఆశీర్వాదంతో ములుగు టికెట్ బరిలో ఉన్నారని అధిక సంఖ్యలో ఓటు వేసి భారీ మెజారిటీతో బడే నాగ జ్యోతి ని గెలిపించాలని కోరారు. అందరూ కలిసికట్టుగా పనిచేసే ములుగు గడ్డపై బిఆర్ఎస్ జండా ఎగరవేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గొంది వాణిశ్రీ, మండల అధ్యక్షుడు దండుగుల మల్లయ్య, మాజీ ఎంపిటిసి, కాటాపూర్ క్లస్టర్ ఇంచార్జి, సీనియర్ నాయకుడు ముండ్రాతి రాజమౌళి, మాజీ జెడ్పిటిసి రామస్వామి శ్రీనివాస్ రెడ్డి, రైతు సమన్వయ కమిటీ నాయకులు, మాజీ మండల అధ్యక్షులు దిడ్డి మోహన్ రావు, ఆత్మ చైర్మన్ దుర్గం రమణయ్య, దొడ్డపల్లి సాంబయ్య, బండారి చంద్రయ్య, బీరెల్లి సర్పంచ్ జాజ చంద్రం, గౌరబోయిన నాగేశ్వరావు, జిసిసి డైరెక్టర్ పులుసం పురుషోత్తం, ఉప సర్పంచ్ ఇంద్రారెడ్డి ప్రధాన కార్యదర్శి పోగు నాగేష్ యూత్ జిల్లా అధ్యక్షులు డేగల సలేందర్ దిలావర్ ఖాన్ మాజీ మండల అధ్యక్షులు వైస్ ఎంపీపీ మాజీ మంత్రి నర్సయ్య, రేగ నరసయ్య నాగక్క విక్రమ్ గ్రామ కమిటీ అధ్యక్షులు రంగు సత్యనారాయణ, కొర్నెబెల్లి శేషగిరి, ఇరుప రామకృష్ణ, భాగే కోటేష్, సయ్యద్ హుస్సేన్ వహీద్ తడుకారిష్ కందకట్ట సాంబయ్య కోటయ్య మహేశ్వర చారి లంజపల్లి అని వెంకటేష్ గంగెల్లి విజయ్, దానక నర్సింగరావు, పాలకుర్తి బాబు, బందెల సారయ్య, కొండ బత్తుల లక్ష్మణ్, సోషల్ మీడియా ఇన్ఛార్జు లు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.