రాబట్(మొరాకో): ఇక్కడ జరుగుతున్న ఎటిపి-250 మర్రకెచ్ ఓపెన్‌లో భారత టెన్నిస్ స్టార్ సుమిత్ నాగల్ పోరాటం ప్రి క్వార్టర్స్‌లో ముగిసింది. బుధవారం జరిగిన ప్రి క్వార్టర్స్ పోటీలో నాగల్ మూడుసెట్ల హోరాహోరీ పోరులో ఓటమిపాలయ్యాడు. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో సుమిత్ 6-1, 3-6, 4-6తో ఇటలీకి చెందిన సొనేగో చేతిలో ఓడాడు. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో సుమిత్ 95వ స్థానంలో ఉండగా.. 6.3అంగుళాల పొడగరి అయిన ఇటలీకి చెందిన సొనేగో టాప్-20 ప్లేయర్. ఇక పురుషుల డబుల్స్‌లో యుకీ బాంబ్రీ-అల్బానో(ఫ్రాన్స్) జంట 3-6, 4-6తో నెదర్లాండ్స్ జంట చేతిలో వరుససెట్లలో ఓడారు.