నాగమణిది ఆస్తి గొడవ కాదు.. అగ్రకుల దురహంకార హత్య 

Nagamani is not a property dispute.. an arrogant murder of the upper class
Created with GIMP

– కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్కైలాబ్ బాబు 

– నాగమణి భర్త శ్రీకాంత్ కు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి 
– ఆమె పేరుతో ఉన్న ఎకరా భూమి శ్రీకాంత్ కు విరాసత్ చేయాలి 
– కుల దురహంకార హత్యలపై పాస్టర్ కోర్టు ద్వారా విచారణ కొనసాగించాలి
– తెలంగాణలో 108 కుల దురహంకార హత్యలు కులాంతర, మతాంతర వివాహాల రక్షణ చట్టం తేవాలి 
– కులాంతర వివాహాలకు ప్రభుత్వ ప్రోత్సాహం ఇవ్వాలి 
– నాగమణి హత్యపై కేవీపీఎస్ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు 
– ఇబ్రహీంపట్నంలో రౌండ్ టేబుల్ సమావేశం..
నవతెలంగాణ – రంగారెడ్డి ప్రతినిధి 
నాగమణిది ఆస్తి గొడవ కాదని, అగ్రకుల దురహంకార హత్యని కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్కైలాబ్ అన్నారు. ఆస్తి గొడవగా చిత్రీకరించే ప్రయత్నం చేయడం సరికాదన్నారు. కులాంతర, మతాల వివాహాల రక్షణ చట్టం తీసుకురావాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణలో 108 కుల దూరాంకార హత్యలు జరిగాయని ఆందోళన వెలిబుచ్చారు. అయినా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని మండిపడ్డారు. ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని రాయపోలు గ్రామానికి చెందిన కానిస్టేబుల్ నాగమణి కుల దురహంకార హత్యను నిరసిస్తూ కేవీపీఎస్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నంలోని పాషా, నరహరి స్మారక కేంద్రంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలు ప్రజా సంఘాలు, కుల సంఘాలు, వివిధ కార్మిక సంఘాలు హాజరయ్యాయి. నాగమణి హత్యను నిరసించారు. అనంతరం రాయపోల్ గ్రామంలో శ్రీకాంత్ కుటుంబాన్ని పరామర్శించారు. హత్య విషయమై ఇబ్రహీంపట్నం ఏసిపి రాజులు కలిసి వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా కైలాబ్ బాబు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో 108 కుల దురహంకార హత్యలకు జరిగాయని ఆందోళన వెలిబుచ్చారు. కుల నిర్మూలనే ప్రధాన లక్ష్యంగా బలమైన పోరాటాలు నిర్వహించాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. కులాంతర, మతాంతర వివాహల రక్షణ చట్టం తీసుకురావాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
 కులాంతర వివాహాలు చేసుకున్న వారికి ప్రభుత్వ ప్రోత్సాహం ఇవ్వడం లేదని అన్నారు. నాగమణి హత్య విషయంలో కేసును తప్పుదారి పట్టించేందుకు ఆర్ఎస్ఎస్, బీజేపీ  భావజాల శక్తులు కుట్ర పన్నుతున్నాయని విమర్శించారు. భూస్వామ్య కుల దురహకార హత్యగా కాకుండా ఆశ తగాదాల హత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఆస్తి గొడవలు అయితే న్యాయస్థానాల ద్వారా సమస్యను పరిష్కరించుకునేందుకు అవకాశం ఉన్న ఎందుకు నాగమణి హత్య చేయాల్సిన అవసరం ఉందని ప్రశ్నించారు. కేవలం దళిత వర్గానికి చెందిన యువకున్ని వివాహం చేసుకోవడమే నాగమణి చేసిన తప్పా అని ప్రశ్నించారు. ఇప్పటికీ నాగమణి హత్య జరిగి రెండు రోజులు కావస్తున్న ఎందుకు ఆర్ఎస్ఎస్, బీజేపీ పార్టీలు హత్యను ఖండించడం లేదని ప్రశ్నించారు. నాగమణి, శ్రీకాంత్ ఇద్దరూ హిందువులేనని, వారు పెళ్లి చేసుకుంటే తప్పే ఉంటే నీ ప్రశ్నించారు. ఈ హత్యపై మతతత్వ పార్టీ ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. బీసీ సంఘాలు కూడా ఖండించాల్సిన అవసరం ఉందన్నారు. మతం కంటే మానవత్వం, కులం కంటే గుణం ముఖ్యమనే ఆలోచన విధానాన్ని ప్రజల్లో చైతన్య నింపాల్సిన అవసరం ఉందన్నారు. శ్రీకాంత్ తక్కువ కులంలో పుట్టడమే నేరమా అని ప్రశ్నించారు. అయినా గత ఎనిమిది సంవత్సరాలుగా వారిద్దరు ప్రేమించుకుంటూ  గత 20 రోజుల క్రితం వివాహం చేసుకున్నారని గుర్తు చేశారు. పసుపు, కుంకుమల కింద నాగమణి మొదటి వివాహానికి ఇచ్చిన ఆస్తిని వెంటనే శ్రీకాంత్ కు రిజిస్ట్రేషన్ చేయించాలని రెవెన్యూ అధికారులకు సూచించారు. కారుణ్య నిమకాల్లో భాగంగా నాగమణి ఉద్యోగాన్ని శ్రీకాంతుకు బదిలీ చేయాలని కోరారు. అందుకు రౌండ్ టేబుల్ సమావేశం తీర్మానం చేసింది. నాగమణి హత్య జరిగిన వెంటనే కేవీపీఎస్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలకు పిలుపునివ్వడం జరిగిందన్నారు. ఇబ్రహీంపట్నంలోనూ నిరసన వ్యక్తం చేశామని చెప్పారు. ఈ రోజు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆయా జిల్లా, మండల, నియోజకవర్గ కేంద్రాల్లో నిరసనలు జరుగుతున్నాయని చెప్పారు.
త్వరలోనే రాయపోలు గ్రామంలో నాగమణికి సంతాప సభ ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. అందుకు అన్ని రాజకీయ పార్టీలతో పాటు కుల సంఘాలు, బీసీ సంఘాలు కూడా కలిసి రావాలని సూచించారు. కుల నిర్మూలన సంఘం రాష్ట్ర అధ్యక్షులు వహీద్ ముతో పాటు సీఐటీయూ నాయకులు కిషన్, ఐద్వా నాయకురాలు సుమలత, విజయమ్మ, అరుణ, కేవీపీఎస్ నాయకులు ప్రకాష్ కరత్, మాల మహానాడు నాయకులు కృష్ణయ్య, మారయ్య, యాదగిరి, రచయితల సంఘం నాయకులు బండి సత్తన్న, నూతనగంటి పురుషోత్తంతో పాటు పలువురు ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ.. నాగమణి హత్య పై ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కుల నిర్మూలన చేయకుండా అభివృద్ధి అసాధ్యమన్నారు. అందుకు ఐక్య ప్రతిఘటన ఉద్యమాలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. ప్రజా సంఘాలు, పార్టీలు ఈ హత్యను ఖండించాలని డిమాండ్ చేశారు. కుల దువాహంకార హత్యలను కట్టడి చేయకపోతే భవిష్యత్తులో మరిన్ని హత్యలు జరిగే ప్రమాదం లేకపోలేదన్నారు. కులం విష సర్పాలకంటే ప్రమాదకరమని హెచ్చరించారు. విద్యావంతులున్న ప్రాంతాల్లోనే ఇలాంటి కుల దృహంకార హత్యలు కొనసాగడం ఆందోళన కలిగిస్తుందని పూసల సంఘం నాయకులు పురుషోత్తం హెచ్చరించారు. ప్రేమించే పెళ్లి చేసుకొని అన్యోన్యంగా జీవితం గడుపుతున్న వారిని హత్యలు చేయడం సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉందన్నారు. ఈ హత్యలను ఖండించాలని పిలుపునిచ్చారు. కేవీపీఎస్ జిల్లా అధ్యక్షులు బోడ సామేల్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో బీఎస్పీ నాయకులు రఘుపతి, పూసల సంఘం నాయకులు పురుషోత్తం, ఐద్వా జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సుమలత, విజయ, నాయకురాలు మస్కు అరుణ, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కే జగన్, మాల మహానాడు నాయకులు కృష్ణయ్య, మారయ్య, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు శంకర్, నాయకులు చరన్, తరంగ్, శ్రీకాంత్, డివైఎఫ్ఐ నాయకులు రాజు, సీఐటీయూ నాయకులు కిషన్, యాదగిరి, ప్రజాసంఘాల నాయకులు తదితరులు ఉన్నారు.