చాందిని క్రియేషన్స్ బ్యానర్ పై మహేష్ కుమార్ హీరోగా, చిత్రం శ్రీను ప్రధాన పాత్రలో నెక్కింటి నాగరాజు నిర్మిస్తున్న తాజా చిత్రం ‘నాగన్న’. ఈ చిత్రాన్ని సతీష్ కుమార్, మహేష్ కుమార్ ద్వయం దర్శకత్వం చేస్తున్నారు. సింధు సిరి, చందన, రూప, జనర్థాన్, స్వాతి ఘట్కర్ తదితరులు నటిస్తున్న ఈ చిత్ర ట్రైలర్ విడుదలైంది. ఈ సందర్భంగా డైరెక్టర్ సతీష్ కుమార్ మాట్లాడుతూ,’అదిత్య మ్యూజిక్‌లో పాటలు వచ్చేలా కషి చేసిన నిరంజన్, మాధవ్‌కి ప్రత్యేక కతజ్ఞతలు. సినిమా ఇంత బాగా రావడానికి ప్రొడ్యూసర్ నెక్కంటి నాగరాజు ఇచ్చిన ప్రోత్సాహం ఎంతో ఉంది’ అని తెలిపారు. హీరో, డైరెక్టర్ మహేష్ మాట్లాడుతూ,’12 సంవత్సరాలుగా ఇండిస్టీలో అనుభవం ఉంది. ఈ కథని చాలా మంది హీరోల దగ్గరకు వెళ్లి చెప్పాను. అలా నాలుగు సంవత్సరాలు గడిచిపోయాయి. ఇక ప్రొడ్యూసర్ నాగరాజు నన్నే హీరోగా పెట్టి చేయమన్నారు. ఒక ఊరిలో ఉండే కొంత మంది కుర్రాళ్ళు ఒక నిధి కోసం ప్రయత్నిస్తారు. ఈ వేటలో వారికి నిధి దొరికిందా లేదా అనే కథాంశంతో ఈ సినిమాని తెరకెక్కించాం. విడుదలైన ట్రైలర్‌కు మంచి ప్రశంసలు వస్తున్నాయి. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తాం. ఈ సినిమా ఓటీటీలోనే కాకుండా సొంతంగా థియేటర్లలో కూడా రిలీజ్ చేస్తున్నాం’ అని అన్నారు. హీరోయిన్ సింధు మాట్లాడుతూ,’తెలుగు అమ్మాయిగా పుట్టినందుకు సంతోషంగా ఉంది. ఓ మంచి కథతో రూపొందుతున్న చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాం. మీరందరూ ఆదరిస్తారని ఆశిస్తున్నాం’ అని చెప్పారు.