అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందిస్తామని నాగర్ కర్నూల్ జిల్లా డీసీసీ జనరల్ సెక్రటరీ జిల్లెల జగత్ రెడ్డి అన్నారు. బుధవారం ఉప్పునుంతల మండల పరిధిలోని అయ్యవారిపల్లి గ్రామంలో ప్రజాపాలన గ్రామసభ నిర్వహించారు. కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నారని తెలిపారు. ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ సహకారంతో ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తామని తెలిపారు. ప్రభుత్వం ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు, రుణమాఫీ, ఉచిత కరెంటు, 500 కు ఉచిత గ్యాస్ సిలిండర్, పదిలక్షల ఆరోగ్యశ్రీ లాంటి పథకాలు ఇచ్చిందని తెలిపారు. కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లు, ఇందిరమ్మ ఆత్మీయ రైతు భరోసా, పథకాలను ప్రభుత్వం అర్హులైన వారికి లబ్ధి చేకూరేలా ప్రభుత్వం అమలు చేసే విధంగా కృషి చేస్తుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ అధికారి చందు నాయక్, మండల వ్యవసాయ అధికారి రమేష్, మిషన్ భగీరథ ఏఈఈ సాయి కృష్ణ, పంచాయతీ కార్యదర్శి, ఏఈఓ సుమతి, మాజీ ఎంపిటిసి మల్లేష్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.