నాగర్ కర్నూల్ ఎంపీ టికెట్ మాదిగలకు కేటాయించాలి:  ఎంఎస్ఎఫ్

నవతెలంగాణ – అచ్చంపేట
నాగర్ కర్నూల్ పార్లమెంటు సభ్యుడు ను మాదిగలకు కేటాయించాలని డిమాండ్ చేశారు.శుక్రవారం నాడు  పట్టణంలో బాబు జగ్జివన్ రాం భవన్ లో విలేకరుల సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా బుక్కపురం మహేష్ మాదిగ మాట్లాడుతూ. నాగర్ కర్నూల్ పార్లమెంట్ స్థానము కాంగ్రెస్ పార్టీ, అన్ని రాజకీయ పార్టీలు మాదిగలకే ఇవ్వాలని డిమాండ్ చేశారు. నియోజకవర్గ పరిధిలో అత్యధికంగా జనాభా కలిగిన మాదిగలకు ఇవ్వాలని డిమాండు చేశారు.  కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు జరిగిన ఎన్నికల్లో అత్యధికంగా మాదిగ అభ్యర్థులే విజయం సాధించారని గుర్తు చేశారు.చట్టసభల్లో మాదిగలకు ప్రాతినిధ్యం తగ్గేలా కాంగ్రెస్ కుట్రాచేస్తుంది. ఈ కుట్రలో మల్లు భట్టి విక్రమార్క, రేవంత్ రెడ్డి, ఢిల్లీలో కొప్పుల రాజు అలాగే మల్లికార్జున్ ఖర్గే లు పాల్పడుతున్నారు. అందుకు సాక్ష్యంగా వర్ధన్నపేట చొప్పదండి చెన్నూరు , సత్తుపల్లి స్థానాలలో మాదిగలకు కాంగ్రెస్ చేసిన అన్యాయంతో పాటు  నిన్న ఎమ్మెల్సీ ఎంపికలో జరిగిన మోసంతో అది రుజువైందన్నారు.మాదిగల జనాభా అత్యధికంగా ఉన్న స్థానాలైన సత్తుపల్లి , వర్ధన్నపేట, చొప్పదండి, చెన్నూరు నియోజకవర్గాల్లో సీట్లను మాలలకు కేటాయించి మాదిగలకు అన్యాయం చేశారని అన్నారు.కడియం శ్రీహరి స్ధానంలో ఖాళీ అయిన ఎమ్మెల్సీ  స్థానం మాదిగలకు ఇవ్వకుండా ఇతరులకు ఇచ్చారు.శాసనమండలిలో 40 మంది సభ్యులు ఉంటే మాదిగలు ఒక్కరు కూడా లేరని  , శాసన మండలిలో 2 స్థానాలు ( ఒకటి oc, మరొకటి oc) ఖాళీ అయితే  ఓసి లది, ఓసిలకు ఇచ్చి , ఎస్సీలది మాత్రం మాదిగలకు ఇవ్వకుండా అన్యాయం చేశారు. ఇంత అన్యాయం చేస్తుంటే మాదిగలు కాంగ్రెస్ ను ఎలా నమ్ముతారు.   నాగర్ కర్నూలు పార్లమెంట్ సభ్యునిగా ఇతరులకు ఇస్తే  ఓడగొడుతాం అని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నేతలు ఏడెల్లి ఆంజనేయులు, గుద్దటి ప్రవీణ్, చంటి, రాజు, మల్లేష్, అనిల్ అజాయ్ తదితరులు పాల్గొన్నారు.