నాగరాజు మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు

Nagaraju's death is a huge loss for the Congress party– తాడిచెర్ల పిఏసిఎస్ చైర్మన్ ఇప్ప మొండయ్య
నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలోని రుద్రారం గ్రామానికి చెందిన, కాంగ్రెస్ పార్టీ మంథని నియోజకవర్గ సోషల్ మీడియా కో ఆర్డినేటర్ నస్పూరి నాగరాజు అకాలంగా మృతి చెందడం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని తాడిచెర్ల పిఏసిఎస్ చైర్మన్ ఇప్ప మొండయ్య, భూపాలపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సిసెల్ అధ్యక్షుడు దండు రమేష్,మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బడితేల రాజయ్య అన్నారు. నాగరాజు హైదరాబాద్ లోని నిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున మృతిచెందిన విషయం తెలుకున్న మండల కాంగ్రెస్ నాయకులు రుద్రారం గ్రామానికి పెద్దయెత్తున చేరుకొని నాగరాజు మృతదేహానికి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి ఘనంగా నివాళులర్పించారు. అధైర్య పడొద్దు ప్రభుత్వం, దుద్దిళ్ల కుటుంబం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అనంతరం అంత్యక్రియలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మత్స్య శాఖ డైరెక్టర్ జంగిడి శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు ఐత రాజిరెడ్డి, మండల యూత్ అధ్యక్షుడు గడ్డం క్రాంతి, భూపాలపల్లి జిల్లా కాంగ్రెస్ ఎస్టీ సెల్ ప్రధాన కార్యదర్శి సవేందర్,ఇందారపు అనిల్,చంద్రమోహన్ తోపాటు మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు,యూత్ నాయకులు,కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.