డాబర్‌ మెస్వక్‌కు ప్రచారకర్తగా నాగార్జున

డాబర్‌ మెస్వక్‌కు ప్రచారకర్తగా నాగార్జునహైదరాబాద్‌ : సైన్స్‌ ఆధారిత అయుర్వేద కంపెనీ డాబర్‌ ఇండియా తన డాబర్‌ మెస్వక్‌ టూత్‌పేస్ట్‌ బ్రాండ్‌ అంబాసీడర్‌గా హీరో నాగార్జున అక్కినేనిని నియమించుకున్నట్టు ఆ కంపెనీ తెలిపింది. ఈ టూత్‌పేస్ట్‌తో 70 పైగా లాభాలు ఉన్నాయని పేర్కొంది. నాగార్జునతో ప్రచారం దక్షిణాదిలో తమ బ్రాండ్‌ను బలోపేతం చేసుకోవడానికి దోహదం చేయనుందని డాబర్‌ ఇండియా ప్రతినిధి అభిషేక్‌ జుగ్రన్‌ పేర్కొన్నారు.