నాగయ్య పురస్కార ఫలితాలు

ప్రముఖ స్వాతంత్ర సమర యోధుడు యం.చిననాగయ్య స్మారక జాతీయ పురస్కారానికి వ్యాసాల విభాగంలో పి.తిరుపతి రావు (రాజాం), ఎల్‌.ఆర్‌.వెంకట రమణ (అనంత పురం), కవిత్వం విభాగంలో సోంపాక సీత (భద్రా చలం), టి.నీలిమ (హైదరాబాద్‌), బి.జయరావు (నెల్లూరు), కథల విభాగంలో ఎన్‌. అనురాధ (విజయవాడ), యం. సుగుణరావు (విశాఖ పట్నం), జె. సుబ్బారావు (నూజివీడు), బి.కళా గోపాల్‌ (నిజామాబాద్‌), జీవిత చరిత్రల విభాగంలో ఎస్‌.డి.వి.అజీజ్‌ (కర్నూలు)లు ఎంపికైనట్లు చిన నాగయ్య మెమోరియల్‌ ట్రస్ట్‌ ప్రతినిధి యం.రాం ప్రదీప్‌ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. విజేతలకు అక్టోబర్‌లో తిరువూరులో పురస్కారాలని అందజేస్తామని వెల్లడించారు.