నాగేంద్ర పారిశ్రామిక శిక్షణా కేంద్రం సీజ్‌

నాగేంద్ర పారిశ్రామిక శిక్షణా కేంద్రం సీజ్‌– ఆస్తి పన్ను చెల్లించకపోవడంతో అధికారుల చర్యలు
నవతెలంగాణ-మిర్యాలగూడ
నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మున్సిపల్‌ పరిధిలో శ్రీనివాసనగర్‌ కాలనీలోని నాగేంద్ర పారిశ్రామిక శిక్షణా కేంద్రం(ఐటీసి) యాజమాన్యం ఆస్తిపన్ను చెల్లించక పోవడంతో కేంద్రాన్ని మున్సిపల్‌ అధికారులు మంగళవారం సీజ్‌ చేశారు. ఐటీసి సుమారు రూ.2,86,392 బకాయి ఉండగా ప్రభుత్వం వడ్డీ రాయితీ వల్ల రూ.93,564 మాఫీ ఉంటుందని రూ.1,92,828 చెల్లించాల్సి ఉంటుందని చెప్పినా యాజమాన్యం స్పందించలేదు. దాంతో కేంద్రానికి తాళాలు వేశామనిమున్సిపల్‌ కమిషనర్‌ ఎండి.యూసుఫ్‌ తెలిపారు. భారీ బకాయిలున్న వారికి రెడ్‌ నోటీసులు ఇచ్చిన అనంతరం స్పందన లేకపోతే సీజ్‌ చేస్తున్నామని చెప్పారు. బకాయిదారులకు గౌరవంగా నోటీసులు ఇచ్చిన తర్వాతనే సీలు వేస్తున్నామన్నారు. పన్నులు చెల్లించేందుకు బకాయిదారులు ముందుకు రావాలని, సహకరించాలని కోరారు. కార్యక్రమంలో మునిసిపల్‌ రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు రాకేష్‌, రవి, బిల్‌ కలెక్టర్లు పాల్గొన్నారు.