నవతెలంగాణ-భూదాన్ పోచంపల్లి : పోచంపల్లి మండలం జూలూరు గ్రామంలో గ్రామ సంఘ వి.ఓ.ఏ. పని చేస్తున్న కేతం స్వరూప, భర్త పోచయ్య ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలలో రాజకీయ పార్టీ ప్రచార కార్యక్రమాలలో పాల్గొన్నదనే ఆరోపణ వచ్చినందున జిల్లా కలెక్టరు ఆదేశాల మేరకు నిర్వహించిన విచారణలో నిరూపితమైనందున ఎన్నికల నియమావళి ప్రకారము, జీ .ఓ నెం 58 ప్రకారం చట్ట విరుద్దం అయినందున శుక్రవారం స్వరూపను గ్రామ సంఘం తీర్మాణం చేసి విధుల నుండి తొలగించడం జరిగిందని జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి నాగిరెడ్డి నేడొక ప్రకటనలో తెలిపారు.