నాగిరెడ్డిపేట్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడిగా శ్రీధర్ గౌడ్..

నవతెలంగాణ – నాగిరెడ్డిపేట్

నాగిరెడ్డిపేట్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడిగా శ్రీధర్ గౌడ్ ను నియమించినట్లు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు శనివారం తెలిపారు. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే ఎన్నికల సమయంలో ధర్మారెడ్డి గ్రామ సర్పంచ్ గా ఉన్న శ్రీధర్ గౌడ్ ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు గెలుపునకు తన వంతు కృషి చేశారు. శనివారం ఎల్లారెడ్డి క్యాంప్ కార్యాలయంలో మండల ప్రెసిడెంట్ నియామకం నిర్వహించినట్లు వారు పేర్కొన్నారు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడిగా శ్రీధర్ గౌడ్ ను యూత్ అధ్యక్షుడిగా శ్రీరామ్ గౌడ్ నియమించినట్లు కాంగ్రెస్ నాయకుడు తెలిపారు.