నాగిరెడ్డి మరణం కమ్యూనిస్టు ఉద్యమానికి తీరని లోటు..  

– చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాలి…. 
– సీపీఐ(ఎం) పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు సూడి కృష్ణారెడ్డి
నవతెలంగాణ – గోవిందరావుపేట :- సీపీఐ(ఎం) పార్టీ సీనియర్ నాయకుడు సామ నాగిరెడ్డి అకాల మరణం కమ్యూనిస్టు ఉద్యమానికి తీరనిలోటని సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు సూడి కృష్ణారెడ్డి అన్నారు.  సోమవారం సీపీఐ(ఎం) పార్టీ సీనియర్ నాయకుడు సామ నాగిరెడ్డి సంతాప సభ   పసర గ్రామంలోని వారి స్వగృహం నందు సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యుడు తీగల ఆదిరెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా నాగిరెడ్డి చిత్రపటానికి సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు సూడి కృష్ణారెడ్డి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయనకు సంతాపం ప్రకటించారు. అనంతరం కృష్ణారెడ్డి హాజరై మాట్లాడుతూ నాగిరెడ్డి ఇటీవల ఆకస్మిక మరణం పార్టీ శ్రేణులను కలిసివేసిందని అన్నారు.   గత 40 సంవత్సరాలుగా నాగిరెడ్డికి పార్టీతో అనుబంధం ఉందని ఆయన అనేక పోరాటాల్లో పాల్గొన్నారని తెలిపారు. పార్టీ కార్యకర్తలు కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీకి అండగా ఉన్నారని అన్నారు. నాగిరెడ్డి ఎర్రజెండా కోసం చివరి బొట్టు వరకు  అహర్నిశలు కృషి చేశారని పార్టీకి ఆర్థికంగా హార్దికంగా అనేక సహాయ సహకారాలు అందించారని తెలిపారు. పసర గ్రామ ఉద్యమ నిర్మాణం లో ఆయన పాత్ర మరవలేనిదని అన్నారు. ఆయన రైతాంగ పోరాటంలో  పాల్గొన్నారని తెలిపారు. ఆయన కుటుంబానికి సిపిఎం పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు తుమ్మల వెంకటరెడ్డి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి యానాల అనంతరెడ్డి, సిపిఎం పార్టీ మండల కార్యదర్శి సోమ మల్లారెడ్డి,  సీనియర్ నాయకులు అంబాల పోశాలు, మండల కమిటీ నాయకులు అంబాల మురళి, కె సదానందం కె  కృష్ణారావు, మంచాల కవిత, కే రాజేశ్వరి ,కె సూర్యనారాయణ, ఎం ఉపేంద్ర చారి, పి రాజు, జి ఐలయ్య, ఎం సాంబయ్య, ఎస్ సువర్ణ, కే రాజు, తదితరులు పాల్గొన్నారు.