పంటలను పరిశీలించిన నాగుల గావ్ క్లస్టర్ ఏఈఓ

Nagula Gaon Cluster AEO inspected the cropsనవతెలంగాణ. –  జుక్కల్
 మండలంలోని నాగల్గావ్ గ్రామంలో క్షేత్ర స్థాయిలో శనగ,  కంది, జొన్న పంటలను వ్యవసాయ విస్తరణ అధికారి సతీష్ చిద్రావర్ పరిశీలించి రైతుసోదరులకు తగు సలహాలు, సూచనలు అందించడం జరిగింది. ప్రస్తుతం కంది పంట పూత,పిందె దశలో వుంది. కంది పంటలో ప్రధానంగా ఆకుముడత గమనించడం జరిగింది. దీని నివారణకు ప్రోఫెనోఫాస్ 50 EC 400ml లేదా Emamectin benzoate(EM1) 100గ్రాములు ఎకరాకు పిచికారి చేయాలని సూచించడం జరిగింది. అదే విధంగా ప్రస్తుత వాతావరణంలో మారుక మచ్చల పురుగు మరియు పచ్చ పురుగు వచ్చే అవకాశం వుంది అని దీని నివారణకు Emamectin benzoate(EM1) 100గ్రాములు ఎకరాకు లేదా Emamectin benzoate +Lufenuron (Evicent) 24గ్రాములు ఎకరాకు లేదా Flubendimide(టకుమి)ఎకరాకు 100గ్రాములు దీనితో పాటు 13.0.45 ఎకరాకు 1కేజీ + తెగుళ్ల నివరకు carbendizum-Mancozeb(సాఫ్) 400గ్రాములు ఎకరాకు లేదా Hexaconazole(Contaf plus)400ml ఎకరాకు మందులు పిచికారి చేయాలని రైతులకు వివరించడం జరిగింది. పురుగు మందులు మార్చి మార్చి పిచికారి చేయడం వలన పురుగులను సమర్థవంతంగా అరికట్టవచ్చు అని వివరించారు. శెనగ పంటలో ప్రధానంగా ఎండు తెగులు గమనించడం జరిగింది. దీని నివారణకు Copper oxy chloride(COC) అనే మందును లీటర్ నీటికి 3గ్రాములు  అనగా ఎకరాకు 500గ్రాములు మొక్క బాగా  తడిచేల పిచికారి చేయాలని సూచించారు. తరవాత దశలో శెనగ పంటలో శెనగ పచ్చ పురుగు ఆశించే అవకాశం వుంది అని దీని నివారణకు Profenophos 50EC@400ml ఎకరాకు లేదా Emamectin benzoate (EM1)100గ్రాములు ఎకరాకు పిచికారి చేయాలని సూచించడం జరిగింది. ఈ క్షేత్రస్థాయి సందర్శనలో క్లస్టర్ ఏఈఓ, రైతు సోదరులు రగోబా శ్రీనివాస్,అంతేశ్వెర్ గొండా,ప్రహ్లాద్ గోండ తదితరులు పాల్గొన్నారు.