నవతెలంగాణ-రామగిరి: మండల నాయబ్ తహశీల్దార్ గా యజ్ఞం బట్ల మానస గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ నాయబ్ తహశీల్దార్ గా పనిచేసిన రాకేష్ బదిలీపై వెళ్లగా సాధారణ బదిలీల్లో భాగంగా రెవెన్యూ డివిజన్ అధికారి, మంథని కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న యజ్ఞంబట్ల మానస, రామగిరి నాయబ్ తహశీల్దార్ గా పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, ఉత్తర్వులు జారి చేసినారు. రామగిరి నయా తహసిల్దార్ గా యజ్ఞంబట్ల మానస, రామగిరి తహశీల్దార్ బి.రాంచందర్ రావు సమక్షంలో విధులలో చేరినారు. ఈ కార్యక్రమంలో సీనియర్ అసిస్టెంట్ సంపత్ ఆర్ఐ లు నిహారిక, మహేష్ జూనియర్ అసిస్టెంట్ రజిత, ధరణి ఆపరేటర్ రంజిత్ కంప్యూటర్ ఆపరేటర్ రాజేష్ తదితరులు ఉన్నారు.