
నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలోని కొయ్యూరు- పీవీ నగర్ మానేరు నది పక్కన అటవీ గుట్ట పైన సొరంగం చేసి కాకతీయులు నిర్మించిన నైనా గుళ్ళు నిర్మాణం ఒక అద్భుతం అని ఫ్రాన్స్ దేశ పర్యటకురాలు, పరిశోధకురాలు సోలెన్ అన్నారు.మంగళవారం జైన గుళ్ళు ( నైన గుళ్ళు )ఏకశిలా గుహలను అధ్యయనం చేయడానికి ఆమే సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు ఒకే రాతిలో నిర్మించబడినటువంటి గుహల యొక్క శిల్ప సౌందర్యాన్ని, భారతీయ రాతి కట్టడ నిర్మాణ శైలిని ఆమె వీక్షించారు. గుహ లోపల ఉన్న కుద్య చిత్రాలను చూసి ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉండడం విశేషం అంటూ అలనాటి చిత్రకళను చూసి ఆశ్చర్యపోయి సెల్ఫీ తీసుకున్నారు. కాకతీయుల కాలంలో నిర్మించినటువంటి నైనా గుళ్ల నిర్మాణం ఓ చరిత్రకమైనందని అభివర్ణించారు. ఆమె వెంట ఆ దేశ పర్యాటకులు ఉన్నారు.