బీసీ డిక్లరేషన్ వచ్చేదాకా పోరాటం చేయాలి: నాయిని భరత్

నవతెలంగాణ – మల్హర్ రావు
బీసీ డిక్లరేషన్ ప్రకటన వచ్చేదాకా పోరాటం చేయాలని తెలంగాణ బీసీ ప్రజా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాయిని భరత్ పిలుపునిచ్చారు.మండల కేంద్రంలో సోమవారం ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅధితులుగా రాష్ట్ర అధ్యక్షుడు నాయిని భరత్  రాష్ట్ర కన్వీనర్ బండారి దేవేందర్ హాజరై మాట్లాడారు. తెలంగాణ బీసీ ప్రజా సంఘం భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడిగా మండలంలోని  ఎడ్లపల్లి గ్రామానికి చెందిన అక్కినవేని సుమన్ ముదిరాజ్ నియమించినట్లుగా తెలిపారు. జిల్లా బిసి డిక్లరేషన్ వచ్చే వరకు నిరంతర పోరాటం చేయాలని పిలుపునిస్తూ నియామక పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ బీసీ ప్రజా సంఘం వరంగల్ ఉమ్మడి జిల్లా యూత్ అధ్యక్షుడు ఆవునురి సతీష్, ఉమ్మడి జిల్లా నాయకులు బెజ్జాల కోటి, చీదర్ల రవి, బత్తిని వెంకటేష్, భూపాలపల్లి నియోజకవర్గ అధ్యక్షుడు బొజ్జం ప్రవీణ్ పాల్గొన్నారు.