– చిన్నపాటి వరద ఉధృతికి కొట్టుకుపోయిన తాత్కాలిక మట్టి రోడ్డు..
– వాగు దాటేందుకు అవస్థలు పడుతున్న గ్రామస్తులు..
నవతెలంగాణ – వేములవాడ రూరల్
నవతెలంగాణ – వేములవాడ రూరల్
చిన్నపాటి వరద ఉధృతికి కొట్టుకుపోయిన తాత్కాలిక మట్టి రోడ్డు..వాగు దాటేందుకు అవస్థలు పడుతున్న గ్రామస్తులు.. వేములవాడ రూరల్ మండలం హన్మాజీపేట గ్రామంలోని నక్కవాగు గురువారం రాత్రి కురిసిన వర్షానికి ధారాళంగా ప్రవహిస్తుంది. అయితే ఇటీవల నిర్మిస్తున్న బ్రిడ్జి నిర్మాణం సగం వరకు మాత్రమే పూర్తికావడంతో తాత్కాలికంగా మట్టితో వేసిన రోడ్డు వరద ఉధృతికి కొట్టుకుపోయింది. దీంతో గ్రామంతో పాటు చుట్టూ పరిసర గ్రామాల ప్రజల రాకపోకలు నిలిచిపోవడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. వేములవాడ, సిరిసిల్లకు వెళ్లాలంటే లింగంపల్లి మీదుగా తమ వాహనాలను మళ్లిస్తున్నారు. ఇప్పటికైనా అధికార యంత్రాంగం బ్రిడ్జి నిర్మాణాన్ని పనులను వేగవంతం చేసి పూర్తి చేయాలని గ్రామస్థులు కోరుతున్నారు.