నవతెలంగాణ – నెల్లికుదురు
మండలంలోని బ్రాహ్మణ కొత్త పెళ్లి గ్రామానికి చెందిన నలమాస యాకాంతం గౌడ్ నీ సీపీఐ(ఎం) గ్రామ కార్యదర్శిగా నియమించినట్లు సీపీఐ(ఎం) మండల కార్యదర్శి పెరుమాండ్ల తిలక్ బాబు తెలిపారు. మండలంలోని బ్రాహ్మణ కొత్తపల్లిలో గ్రామ శాఖ మహాసభ కొట్టం వెంకన్న అధ్యక్షతన బుధవారం సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాటాలు చేయడంతో ప్రజల సమస్యలు పరిష్కారం అవుతాయని అన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన ఇందిరమ్మ ఇండ్లు రైతు భరోసా రుణమాఫీ గ్రామాలలో అభివృద్ధి కోసం వేస్తున్నటువంటి ఇందిరమ్మ కమిటీలో అన్ని పార్టీలకు అవకాశం కల్పించాలని, ఇచ్చిన హామీలను నెరవేర్చాలని లేనియెడల ప్రజలను సమీకరించి ఆందోళన పోరాటాలు నిర్వహిస్తామని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మహాసభలో సీపీఐ(ఎం) మండల నాయకులు ఇసంపల్లి సైదులు శాఖ సభ్యులు జానీ ఐలయ్య శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.