మున్సిపాలిటీ పరిధిలో మామిడిపల్లి నందు గల నలంద హైస్కూల్ విద్యార్థులు సోషల్ సబ్జెక్టు సంబంధించిన భారతదేశ వ్యవసాయం పాఠంలో భాగంగా బుధవారం క్షేత్ర పర్యటన చేసినారు. పాఠశాల ప్రిన్సిపాల్ సాగర్ ఆధ్వర్యంలో పలు గ్రామాలలో వ్యవసాయ క్షేత్ర స్థాయి పర్యటన చేసి రైతులతో పలు విషయాలు చర్చించి పంట, పొలాలు ఉత్పత్తుల గురించి హైబ్రిడ్ వంగడాల గురించి, రసాయన క్రిమిసంహారక మందుల మోతాదు గురించి విద్యార్థులకు వివరించినారు. ఇ కార్యక్రమం లో నలంద హై స్కూల్ కరస్పాండెంట్ ప్రసాద్ , ఉపాధ్యాయ బృందం విద్యార్థులు పాల్గొన్నారు.