– 23.1 మిల్లీమీటర్లకు గాను 113.2 మిల్లీమీటర్ల వర్షపాత నమోదు
నవతెలంగాణ – నల్గొండ కలెక్టరేట్
నల్లగొండ జిల్లా వ్యాప్తంగా జూన్ 1 నుండి నేటి వరకు 390 శాతం అధిక వర్షపాతం నమోదయింది. ఇప్పటివరకు 23.1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా 113.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. ఇక శనివారం నల్లగొండ జిల్లా వ్యాప్తంగా 115.8 మీ.మీ వర్షపాతం నమోదయింది. అడవిదేవులపల్లి 26.2 మీ.మీ,దామెరచెర్ల 24.9, పిఎ పల్లి 19.6,గుర్రంపోడ్ 17.1, త్రిపురారం 10.7, నిడ్మనూరు 6.3, కనగల్ 4.2, నల్గొండ 2.3,చందంపేట 1.6, అనుముల 1.0, మిర్యాలగూడ 0.6, కట్టంగూర్ 0.5, పెద్దవూర 0.5, వేములపల్లి 0.3, మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది.