– అదుపులోకి తీసుకున్న హైదరాబాద్ పోలీసులు
– వారికి సహకరించిన మరికొంత మంది..
నవతెలంగాణ-నల్లగొండటౌన్
ఫోన్ ట్యాపింగ్ కేసులో నల్లగొండ జిల్లా కేంద్రంలో ఇద్దరు కానిస్టేబుల్స్‌ని శుక్రవారం హైదరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరు మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో నాయకుల ఫోన్లను ట్యాప్ చేశారని వారిపై అభియోగం. ఈ కానిస్టేబుళ్లు నల్లగొండ జిల్లా కేంద్రంలో సర్వర్ రూమ్ ఏర్పాటు చేయగా.. అప్పట్లో మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత ఓ ఎమ్మెల్యే ఎప్పటికప్పుడూ అబ్జర్వ్ చేసినట్టు సమాచారం. ఫోన్ ట్యాపింగ్ కేసులో మరి కొంతమంది పోలీసులు వారికి సహకరించినట్టు ఆధారాలు ఉన్నట్టు తెలుస్తోంది. అదుపులోకి తీసుకున్న పోలీసులను హైదరాబాద్‌కు తరలించారు.