ఫ్యామిలీ రెస్టారెంట్ ను ప్రారంభించిన నల్లగొండ ఎమ్మెల్సీ కోటిరెడ్డి

నవతెలంగాణ – పెద్దవూర
నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గం పెద్దవూర మండలం, పులిచర్ల గ్రామంలో సోమవారం నూతన శ్రీనిధి ఫ్యామిలీ రెస్టారెంట్ ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్సీ ఎంసి కోటిరెడ్డి ని రెస్టారెంట్ నిర్వాహకులు శాలువాతో ఘనంగా సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో తిరుమలగిరి సాగర్ మండలం ఎంపీపీ భగవాన్ నాయక్, మాజీ సర్పంచులు నడ్డి లింగయ్య యాదవ్,శంకర్ నాయక్, నరేష్ నాయక్, జిల్లా నాయకులు రామావత్ రవికుమార్ నాయక్, మాజీ ఎంపీటీసీ లక్ష్మణ్,ఎల్లారెడ్డి, రెస్టారెంట్ నిర్వాహకులు పురుషోత్తం,చిరంజీవి, సుధాకర్ రెడ్డి ఎల్లయ్య గౌడ్,చంద్ర మౌళి నాయక్,ధన్ పాల్ రెడ్డి,గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.