మద్నూర్ లో నల్ల పోచమ్మ మత్తడి పోచమ్మ బోనాల పండుగ

నవతెలంగాణ- మద్నూర్
మద్నూర్ మండల మేజర్ గ్రామపంచాయతీ పరిధిలో ఆదివారం నాడు గ్రామ ప్రజలు నల్ల పోచమ్మ మత్తడి పోచమ్మ బోనాల పండుగలను ఘనంగా జరుపుకున్నారు. బేడల వారీగా బోనాలు నైవేద్యాలతో మేకలను బలి చేస్తూ పండుగ జరుపుకున్నారు ఈ బోనాల పండుగలు ముఖ్యంగా మహిళలు నైవేద్యాలు సమర్పించారు. గ్రామ సర్పంచ్ సురేష్ గ్రామ కార్యదర్శి సందీప్ నల్ల పోచమ్మ మత్తడి పోచమ్మ బోనాల పండుగను దృష్టిలో పెట్టుకొని ఆలయాల పరిసరాలను శుభ్రం చేయిస్తూ ఏర్పాటు చేశారు. ప్రతి సంవత్సరం వర్షాకాలం ప్రారంభంలో గ్రామ ప్రజలు ఈ పండుగలను జరుపుకుంటారు పాడి పంటలు పండాలని ప్రజలంతా సుఖసంతోషాలతో జీవించాలని నల్ల పోచమ్మ మత్తడి పోచమ్మ గ్రామ దేవతలకు ప్రజలంతా మొక్కులు తీర్చుకున్నారు.