మద్నూర్ లో నల్ల పోచమ్మ ఎర్ర పోచమ్మ బోనాల పండుగ

నవతెలంగాణ మద్నూర్: మద్నూర్ మండల కేంద్రంలో ఆదివారం నాడు గ్రామ ప్రజలు నల్ల పోచమ్మ ఎర్ర పోచమ్మ బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు భాజా భజంత్రీలతో బోనాలతో నల్ల పోచమ్మ ఎర్ర పోచమ్మ దేవాలయాలకు మేకలను బలిస్తూ ప్రత్యేక పూజలు జరుపుకున్నారు ఈ పండుగను గ్రామంలో కులాలకు అతీతంగా ప్రతి కుల బేడలుగా బోనాలు తీస్తూ మేకలను బలిజేస్తూ ప్రతి సంవత్సరం ఆనవాయితీగా ఏడాది కూడా నల్ల పోచమ్మ ఎర్ర పోచమ్మ బోనాల పండుగను గ్రామస్తులు ఘనంగా జరుపుకున్నారు ఈ రెండు దేవతలకు గ్రామస్తులు మొక్కుకుంటూ గ్రామ ప్రజలకు సుఖసంతోషాలతో ఉంచాలని వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలు అనుకూలంగా పండాలని ప్రతి కులబేడల వారు మొక్కుకున్నారు నల్ల పోచమ్మ ఎర్ర పోచమ్మ బోనాల పండుగ కోసం గ్రామపంచాయతీ అధికారులు ప్రత్యేకంగా ఆలయాల చుట్టూ ఆలయాల వద్ద చేపట్టవలసిన వసతులన్నీ పంచాయతీ పరంగా పంచాయతీ సిబ్బంది ద్వారా చేపట్టారు ఈ బోనాల పండుగ ప్రతి ఇంటింటా ఎంతో ఆనందాన్ని కలిగించింది