రైల్వే స్టేషన్లో నల్లబెల్లం, పటిక పట్టివేత 

Nallabellam and alum pattiveta at the railway stationనవతెలంగాణ – కంటేశ్వర్

నిజామాబాద్ నగరంలోని రైల్వే స్టేషన్లో నల్లబెల్లంను పట్టుకున్నట్లు ఆర్పిఎఫ్ రైల్వే సిఐ సుబ్బారెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆదివారం నిజామాబాద్ ఆర్పీఎఫ్, జీఆర్పీ ప్రత్యేక బృందాలు 17057 నంబర్ ట్రైన్ లో తనిఖీ చేయగా, ఓ భోగిలో సీటు కింద మూడు నల్లబెల్లం సంచులు, ఏడు పటిక సంచులున్నట్లు గుర్తించారు. దీంతో వాటిని స్వాధీనం చేసుకొని నిజామాబాద్ ఆర్పీఎఫ్ పోస్టుకు తరలించారు. రైల్వే పోలీసులు ప్రత్యేక బృందాలతో పాటు ఎక్సైజ్ అధికారులు సంయుక్తంగా మూడు నల్లబెల్లం సంచులు, 7 పటికలను స్వాధీనం చేసుకున్నట్లు ఆర్పీఎఫ్ సీఐ సుబ్బారెడ్డి తెలిపారు. 120 కేజీల నల్లబెల్లం విలువ సుమారు రూ.9600 ఉంటుందని అలాగే 250 కేజీల బరువు గల పటిక విలువ రూ.10వేలు ఉంటుందని తెలిపారు.  మొత్తం వీటి విలువ రూ.19,600 ఉంటుందని సీఐ సుబ్బారెడ్డి తెలిపారు. తదుపరి చర్యల నిమిత్తం ఎక్సైజ్ పోలీసులకు అప్పగించారు.