– అక్కమాదేవి గృహాలను సందర్శించిన ఎమ్మెల్యే..
నవతెలంగాణ – అచ్చంపేట
పారే సెలయేళ్లు.. పక్షుల కిలకిల రాగాలు.. ఎత్తైన కొండల నుంచి కిందికి జారిపడే జలాలు.. కృష్ణ జింకల సవ్వడి.. పచ్చటి ఆహ్లాదకరమైన వాతావరణం ఎన్నో… ఇలా ప్రకృతి అందాలయ్యకు నల్లమల్ల ప్రాంతం నిలయంగా మారింది అని స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ అన్నారు. ఆదివారం శ్రీశైలానికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న కృష్ణానది పరివాక ప్రాంతంలో పురాతనమైన అక్కమాదేవి గృహాలను ఆయన సందర్శించారు. ఈ గుహలకు గొప్ప చరిత్ర ఉందని 12వ శతాబ్దపు కాలంలో ఇక్కడ వెలిసిన శివలింగానికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేసేవారని గుర్తు చేశారు. పకృతి అందాలను పర్యాటకంగా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది పూర్తి స్థాయిలో పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తే ఈ ప్రాంతంలో నిరుద్యోగులకు ఉపాధి దొరుకుతుందని , టూరిజం శాఖ, ఫారెస్ట్ శాఖ అధికారుల సమన్వయంతో చర్చించి అక్కమాదేవి గృహాలను సందర్శించేందుకు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. ఎమ్మెల్యే వెంట అంతటి మల్లేష్, ఫారెస్ట్ అధికారులు, నాయకులు ఉన్నారు.