నల్లమిట్ట లిఫ్ట్‌ ఇరిగేషన్‌ మరమ్మతులు చేయాలి

సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు అవుతా సైదులు
నవతెలంగాణ-అడవిదేవులపల్లి
అడవిదేవులపల్లి మండలం నల్లమిట్ట తండాలో ఉన్న దత్తాత్రేయ లిఫ్టు ఇరిగేషన్‌ సుమారు రెండున్నర సంవ త్సరాలు దాటిన మరమ్మత్తులు చేయకుండా పాలకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, తక్షణమే మరమ్మత్తులు చేయాలని సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు అవుతా సైదులు డిమాండ్‌ చేశారు. నల్లమిట్ట తండాలోని లిఫ్టును, లిఫ్టు పరిధిలోని భూములను సీపీఐ(ఎం) మండల కమిటీ ఆధ్వర్యంలో సందర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ లిఫ్టు పరిధిలో 332 ఎకరాలు ఉన్నాయని, రెండు గ్రామ పంచాయతీల పరిధిలో ఉన్న రైతులు ఈ లిఫ్ట్‌ కింద ఉన్నారని, సుమారు రెండున్నర సంవత్సరాల నుంచి లిఫ్ట్‌ చెడిపోయిన అధికారులు పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం వలన ఈ గ్రామాల్లోని పేద రైతులు వలసలు వెళ్లి బ్రతుకుతున్నారని ఆవేదన వ్యక్తపరిచారు. తక్షణమే ఈ లిఫ్టులని మరమ్మత్తులు చేపట్టి రైతులను ఆదుకోవాలని, ఈ కాలంలో పంటలు పండక వలసలు వెళ్లిన రైతులందరికీ ఎకరానికి లక్ష రూపాయలు చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) మండల కార్యదర్శి జటంగి సైదులు, సీపీఐ(ఎం) నాయకులు కొర్ర శివనాయక్‌, రామావత్‌ హనుమంతు, రాంబాబు, మధు, సాంబయ్య, కోటయ్య, కాశయ్య, లక్ష్మణ్‌ నాయక్‌, దర్గు, బాబు, తదితరులు పాల్గొన్నారు.