నలు దిక్కులా మార్మోగే.. కంగువ

సూర్య నటిస్తున్న లేటెస్ట్‌ సినిమా ‘కంగువ’. ఈ సినిమాను భారీ నిర్మాణ విలువలతో స్టూడియో గ్రీన్‌, యూవీ క్రియేషన్స్‌ నిర్మిస్తున్నాయి. దిశా పటానీ హీరోయిన్‌గా నటిస్తోంది. చారిత్రక నేపథ్యంతో దర్శకుడు శివ దీన్ని రూపొంది స్తున్నారు. పాన్‌ వరల్డ్‌ మూవీగా మొత్తం పది భాషల్లో తెరకెక్కుతున్న ‘కంగువ’ త్రీడీలోనూ ప్రేక్షకుల ముందుకు రానుంది. సంక్రాంతి పండుగ శుభాకాంక్షలతో మేకర్స్‌ మంగళవారం ఈ సినిమా నుంచి సెకండ్‌ లుక్‌ రిలీజ్‌ చేశారు. ఈ సెకండ్‌ లుక్‌ పోస్టర్‌లో సూర్య యుద్ధవీరుడిగా కనిపించడంతో పాటు ట్రెండీ లుక్‌ క్యారెక్టర్‌లోనూ సర్‌ప్రైజ్‌ చేస్తున్నారు. ‘విధి కాలం కంటే బలమైనది. గతం, వర్తమానం, భవిష్యత్‌ …కాలం ఏదైనా నలుదిక్కులా మార్మోగే పేరు ఒక్కటే..కంగువ ‘ అంటూ సెకండ్‌ లుక్‌ సందర్భంగా మేకర్స్‌ క్యాప్షన్‌ ఇచ్చారు. సెకండ్‌ లుక్‌ ఇంట్రెస్టింగ్‌గా ఉండి ఈ సినిమాపై మరింత హైప్‌ క్రియేట్‌ చేస్తోంది. హై క్వాలిటీ ప్రొడక్షన్‌ వ్యాల్యూస్‌, మెస్మరైజ్‌ చేసే సూర్య స్క్రీన్‌ ప్రెజెన్స్‌తో ఈ సినిమా త్వరలోనే సిల్వర్‌ స్క్రీన్‌ మీదకు గ్రాండ్‌గా రానుందని చిత్ర బృందం తెలిపింది. యోగి బాబు, బాబీ డియోల్‌ తదితరులు నటిస్తున్న ఈచిత్రానికి ఎడిటర్‌ – నిశాద్‌ యూసుఫ్‌, సినిమాటోగ్రఫీ – వెట్రి పళనిస్వామి, యాక్షన్‌ – సుప్రీమ్‌ సుందర్‌, డైలాగ్స్‌- మదన్‌ కార్కే, కథ – శివ, ఆది నారాయణ, ప్రొడ్యూసర్స్‌ – కేఈ జ్ఞానవేల్‌ రాజా, వంశీ, ప్రమోద్‌.