
నవతెలంగాణ-ముధోల్ : శాంతియుతవాతావరణంలోవినాయకనిమజ్ జనోత్సవవేడుకలుజరుపుకోవాలని బైంసా ఎఎస్పీ అవినాష్ కుమార్అన్నారు. నియోజకవర్గ కేంద్రమైన ముధోల్ లో సోమవారం గణేష్ మండప నిర్వహకులు,హిందూ ఉత్సవ కమిటీ సభ్యులు, అధికారులతో జిఎం గార్డెన్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో హాజరై మాట్లాడారు.అన్ని కులాలు,మతాలు సమన్వయం తో పోలీస్ అధికారుల నిబందనలు ఉల్లంఘించకుండా నిమజ్జనోత్సవ వేడుకను జరుపుకోవాలని సూచించారు.మండపం వద్ద విద్యుత్ తీగలతో జాగ్రత్తగా ఉండాలని అవసరమైతే సంబందిత అధికారుల సహాయం తీసుకోవాలని అన్నారు.
నిబంధనలకు ఎవరు విరుద్ధంగా ప్రవర్తించినా, అవాంఛనీయ సంఘటనలకు పాల్పడినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అసాంఘిక శక్తులు, అల్లరి మూకల పై గట్టి నిఘా ఉంచుతామన్నారు. విగ్రహాలను తరలించడానికి ముందురోజే వాహనాలను క్రేన్ లను సిధ్దంగా ఉంచుకోవాలని కోరారు.చిన్న పిల్లలు నిమజ్జన ఊరేగింపు వాహనాలకు దూరంగా ఉండాలని నిమజ్జన ఘాట్ల దగ్గర కు నిమజ్జనాన్ని వీక్షించేందుకు వచ్చేవారు జాగ్రత్తలు పాటించాలని కోరారు. విగ్రహాలు బయలు దేరేటప్పుడు కరెంటు తీగల వద్ద గణేష్ నిర్వహకులు తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు.. విగ్రహ నిమజ్జన ఊరేగింపు సమయములో ఇతరుల మనోభావాలను కించపరిచే విధంగా వ్యవహారించరాదని .హోరెత్తించే శబ్దాలు లేకుండా సహకరించాలన్నారు ప్రతి ఒక్కరు, శాంతియుత వాతావారణంకు సహాకరించాలనికోరారు. ఈ కార్యక్రమంలో సిఐ మల్లేష్,ఎస్ ఐ సాయి కిరణ్.తహసీల్దార్ శ్రీకాంత్,ఉత్సవ కమిటీ అధ్యక్షుడు రోళ్ల రమేష్, గౌరవ అధ్యక్షుడు సుదర్శన్, ఉపాధ్యక్షులు కోరి పోతన్న,టి రమేష్,సాయి ప్రసాద్, కోశాధికారి సాయినాథ్, విడిసి అధ్యక్షుడు జి.నారాయణ, నాయకులు ఎజాజ్ ,రవి,మండప నిర్వహకులు తదితరులుపాల్గొన్నారు.