నమాత్ పల్లి టు తుక్కాపూర్ బీటీ రోడ్డు వెయ్యాలి: సీపీఐ(ఎం) 

నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 
భువనగిరి మండలం నమాత్ పల్లి గ్రామంలో సీపీఐ(ఎం)  పోరుబాట కార్యక్రమంలో భాగంగ గ్రామ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం ప్రజా సమస్యలపై ప్రభుత్వం వెంటనే గ్రామంలో ధ్వంసమైన ఎస్సీ కాలనీలో అంతర్గత సీసీ రోడ్లు నిర్మించాలని, నమాత్ పల్లి టు తుక్కాపూర్ వెళ్లే దారిని బిటి రోడ్డు వేయాలని సీపీఐ(ఎం)  జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు, మండల కార్యదర్శిలు మాటూరు బాలరాజు గౌడ్, దయ్యాల నరసింహలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా  వారు మాట్లాడుతూ.. గ్రామంలో 25 సంవత్సరాల క్రితం నిర్మించిన ఎస్సీ కాలనీ అంతర్గత సీసీ రోడ్లు పూర్తిగా గుంతలమయమై ధ్వంసం అయ్యాయని ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికై ఎమ్మెల్యే కుంభoఅనిల్ కుమార్ రెడ్డి , అధికారులు తక్షణమే స్పందించి ఇస్ట్ మెంట్ వేసి సిసి రోడ్లు నిర్మించాలని డిమాండ్ చేశారు. నమాత్ పల్లి టూ  తుక్కాపూర్ రోడ్డు బీటీ రోడ్డు మంజూరు చేయాలని వంగాల  ఎల్లయ్య బావి వద్ద పెద్ద ఎత్తున గుంతల మయం అయిందని తక్షణమే మట్టి పోసి మరమ్మతులు చేయాలని అన్నారు. గ్రామంలో కోళ్ల ఫారాల వ్యర్ధాలు తిని వీధి కుక్కలు మనుషులను పశువులపై దాడి చేస్తున్నాయని వాటిని అరికట్టాలని, రోడ్ల వెంబడి పేరుకుపోయిన చెత్తాచెదారం పరిష్కరించి దోమల మందు పిచికారి చేయాలని, సీజన్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని,  అక్కడక్కడ వీధిలైట్లు పోయాయని లైట్లు వేయాలని అధికారులను కోరారు. ప్రజా సమస్యలపై  జరగబోయే తాసిల్దార్ కార్యాలయం ముట్టడిని జయప్రదం చేయాలని కార్యకర్తలను ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం)  గ్రామ శాఖ కార్యదర్శి ఎల్లంల వెంకటేశం, మండల కమిటీ సభ్యులు జిట్టా అంజిరెడ్డి, వికలాంగుల సంఘం జిల్లా నాయకులు సుప్పంగ ప్రకాష్, సీపీఐ(ఎం)  నాయకులు బత్తిని దానయ్య గౌడ్, ఐతరాజు కిష్టయ్య, బీనబోయిన ముత్యం ప్రకాష్ గ్రామ రైతులు, మహిళలు పాల్గొన్నారు.