నవ తెలంగాణ – హైదరాబాద్
స్కూల్ ఆఫ్ రోబోటిక్స్‌ను స్థాపించడానికి ఎబిబి రోబోటిక్స్, న్యూ ఏజ్ మేకర్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నామ్‌టెక్ అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నట్లు వెల్లడించాయి. ఈ భాగస్వామ్యంలో భాగంగా 2025లో స్కూల్ ఆఫ్ రోబోటిక్స్‌ను ప్రారంభించనున్నట్లు తెలిపాయి. దేశంలో ఆటోమేషన్, రోబోటిక్స్ నైపుణ్యాలు, పరిశ్రమ ఏకీకరణ విద్యలో ఉన్న అంతరాన్ని తొలగించే లక్ష్యంగా పెట్టుకొని ఈ ఒప్పందం చేసుకు ఎబిబి ఇండియా అధ్యక్షుడు సుబ్రత కర్మాకర్ తెలిపారు. ఉన్నత నాణ్యతతో ఇంజనీరింగ్, సాంకేతిక విద్యలో పెట్టుబడి పెట్టనున్నామన్నారు. రోబోటిక్స్, ఆటోమేషన్‌లో వినూత్న విద్యావిధానాన్ని ఏకీకృతం చేయడానికి, తయారీ రంగం నిరంతర వృద్ధికి తాము మద్దతునిస్తున్నామన్నారు. దేశంలో రోబోటిక్స్ ఇంజనీరింగ్‌లో ప్రతిభావంతుల కొరత ఉందని నామ్‌టెక్ డైరెక్టర్ జనరల్ అరుణ్ కుమార్ పిళ్లై పేర్కొన్నారు. ఈ సహకారం రోబోటిక్స్ రంగం వృద్థిలో కీలక పాత్ర పోషిస్తుందన్నారు.