విశ్వంత్ దుద్దంపూడి, అనురూప్ కటారి హీరోలుగా, విస్మయ హీరోయిన్‌గా శ్రీ నేత్ర క్రియేషన్స్, ఆర్మ్స్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్ల పై ఏ.ప్రశాంత్ నిర్మిస్తున్న చిత్రం ‘నమో’. సర్వైవల్ కామెడీ జోనర్‌లో పూర్తి వినోదాత్మక చిత్రంగా తెరకెక్కబోయే ఈ చిత్రంతో ఆదిత్య రెడ్డి కుందూరు దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. శనివారం ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ లాంచ్ చేశారు. ఈ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా విచ్చేసిన దర్శకులు భీమనేని శ్రీనివాసరావు ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ”ఆదిత్య నా దగ్గర అసిస్టెంట్‌గా పని చేశారు. ఎంతో సిన్సియర్‌గా పని చేస్తాడు. నమో అనే పేరు వినగానే.. నరేంద్ర మోదీ గారి మీద కథ అనుకున్నా. నగేష్, మోహన్ హీరోల పాత్రల పేర్ల మీద టైటిల్ పెట్టానని తెలిపాడు. ఈ మూవీ పెద్ద విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు. ‘నా కథను ఒప్పుకున్న మా హీరో విశ్వంత్, హీరోయిన్ విస్మయకు థ్యాంక్స్. మా సినిమా చాలా బాగా వచ్చింది. సినిమా హాయిగా నవ్వుకునేలా ఉంటుంది’ అని దర్శకుడు ఆదిత్య రెడ్డి కుందూరు చెప్పారు. హీరో విశ్వంత్ దుద్దంపూడి మాట్లాడుతూ,’ఇదొక డిఫరెంట్ చిత్రం. మా డైరెక్టర్ ఆదిత్య డిఫరెంట్ కథ రాసుకున్నారు. ఎంతో వేగంగా సినిమాని పూర్తి చేశారు. ఈ ‘నమో’ను మున్ముందు సిరీస్‌లుగా కూడా తీయొచ్చు’ అని అన్నారు.