జిల్లా ప్రభుత్వ న్యాయవాదిగా నాంపల్లి నరసింహను తాత్కాలికంగా నియమించారు. ఈ మేరకు బుధవారం జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. నాంపల్లి నరసింహ గత 24 సంవత్సరాలుగా న్యాయవాద వృత్తిలో కొనసాగుతున్నారు. గతంలో అదనపు పీపీగా పనిచేశారు.ఈ సందర్భంగా నాంపల్లి నరసింహ మాట్లాడుతూ తనకు ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని పేద ప్రజలకు న్యాయం అందే విధంగా తన వంతు కృషి చేస్తానని అన్నారు.తన నియామకానికి కృషి చేసిన రాష్ట్ర రోడ్లు,భవనాలు, సినిమాటోగ్రాఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, డిసిసి అధ్యక్షుడు కేతావత్ శంకర్ నాయక్, నల్లగొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డిలకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.