మదర్‌ సెంటిమెంట్‌తో నంద

Nanda with mother sentiment

సదా సినిమా, స్కై ఆర్ట్స్‌ పతాకాలపై గోణుగుంట్ల విజరు కుమార్‌ సమర్పణలో సదా హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం ‘నంద’. కళ్యాణ్‌ ఎర్రగుంట్ల నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో శరవేంగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది.
తాజాగా ఈ చిత్ర ఫస్ట్‌ లుక్‌ను లాంచ్‌ చేసిన సందర్భంగా కథానాయకుడు, దర్శకుడు సదా మాట్లాడుతూ, ‘మదర్‌ సెంటిమెంట్‌ నేపథ్యంలో సాగే యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ చిత్రమిది. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే విధంగా తెరకెక్కిస్తున్నాం. చరణ్‌ అర్జున్‌ మా చిత్రానికి నాలుగు అద్భుతమైన పాటలు సమకూర్చారు’ అని తెలిపారు. ఈ చిత్రానికి డిఓపీః జైపాల్‌ రెడ్డి నిమ్మల, సంగీతంః చరణ్‌ అర్జున్‌, స్టంట్స్‌ః జీవన్‌ కుమార్‌, ఎడిటర్‌: పవన్‌ శేఖర్‌, కొరియోగ్రఫీః చంద్ర కిరణ్‌.