నాట్యంలో నంది అవార్డు గెలుపొందిన విద్యార్థినిలు

 నవతెలంగాణ – కమ్మర్ పల్లి

మండలంలోని విజ్ఞాన జ్యోతి ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థినిలు నాట్యంలో నంది అవార్డును గెలుపొందారు. మంగళవారం హైదరాబాదులోని రవీంద్ర భారతి ఆడిటోరియంలో  కీర్తి ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన రిపబ్లిక్ డే ఉత్సవాలలో భాగంగా నాట్య పోటీలు నిర్వహించారు. మండల కేంద్రంలోని శ్రీ పరమేశ్వర నిత్య కళానిలయం నాటి గురువు శిరీష రాజశేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో కూచిపూడి నాట్యంలో శిక్షణ పొందిన విద్యార్థినిలు భవ్య శ్రీ, శాలిని గౌడ్, శ్రీహిత గౌడ్, నిహస్వి గౌడ్, నమ్రత, మనస్విని, సాహితి, మిథిలాదేవి, సుదీక్ష, భువనేశ్వరి, శివాని, బి. మనస్విని నాట్య  పోటీల్లో పాల్గొని నంది అవార్డును గెలుపొందారు. నాట్య గురువు శిరీష రాజశేఖర్ గౌడ్ ను నాట్య పోటీల నిర్వహకులు నటరాజ పురస్కారంతో   సత్కరించారు. ఈ సందర్భంగా నాట్య గురువు  శిరీష మాట్లాడుతూ విద్యార్థినులకు నాట్యంలో శిక్షణ ఇప్పించిన, వారిని తీర్చిదిద్దేందుకు సహకరించిన  తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ చిన్నారులు భవిష్యత్తులో నృత్య కళాకారులుగా ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. కాగా నాట్య పోటీలో నంది అవార్డు గెలుచుకున్న విద్యార్థినులను, నాట్య గురువు శిరీషను పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు అభినందించారు.