– రూ. లక్ష నగదు ప్రోత్సాహం అందజేత
నవతెలంగాణ-హైదరాబాద్ : తెలంగాణ స్టార్ అథ్లెట్, ఆసియా క్రీడల పతక విజేత నందిని అగసారకు అక్షర్ విద్యా సంస్థలు ఆర్థిక తోడ్పాటు అందించాయి. సాధారణ మధ్యతరగతి కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన నందిని.. అంతర్జాతీయ స్థాయిలో భారత్‌కు పతకాలు సాధించింది. తాజా జాతీయ క్రీడల్లోనూ తెలంగాణ తరఫున బరిలోకి దిగుతోంది. ఈ నేపథ్యంలో అక్షర విద్యాసంస్థల వార్షికోత్సవ వేడుకలో హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్‌మోహన్ రావు నందినికి రూ.1 లక్ష నగదు ప్రోత్సాహం అందించారు. ‘యువ అథ్లెట్ నందిని స్ఫూర్తిగా విద్యార్థులు క్రీడల్లో రాణించాలి. 2028 ఒలింపిక్స్‌లో నందిని భారత్‌కు పతకం సాధిస్తుందని ఆశిస్తున్నాను. నందినికి అక్షర విద్యా సంస్థల తరఫున ఎల్లప్పుడూ అండగా ఉంటామని’ జగన్‌మోహన్ రావు తెలిపారు.