
నవతెలంగాణ-డిచ్ పల్లి : మానవతా సదన్ రాకముందు తనకు నలుగురు పిల్లలు ఉండేవారని, ఇప్పుడు మానవతా సదన్ పిల్లలంతా తన పిల్లలేనని,
సదన్ పిల్లలకు “అమ్మ”గా చేయూత నందిస్తానని, ఇక నుంచి నర్సింగ్ చదివే అమ్మాయిలకు ఫీజు ఇతరత్రా అయ్యే ఖర్చులు తానే భరిస్తానని
బోధన్ ఎమ్మెల్యే షకీల్ అమేర్ సతీమణి ఆయేషా అన్నారు. ఆదివారం డిచ్ పల్లి మండల కేంద్రంలోని మానవతా సదన్ లో ఆయేషా ట్రస్ట్ ఆధ్వర్యంలో బోధన్ ఎమ్మెల్యే షకీల్ అమేర్ సతీమణి అయేషా జన్మదినాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా పిల్లల చేత కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయేషా ట్రస్ట్ నిర్వాహకులు అన్నదానం నిర్వహించి, స్వీట్లు పండ్లు పంపిణీ చేశారు. మానవతా సదన్ కేర్ టేకర్ అందే రమేష్, సుధాకర్ సదన్ గురించి క్లుప్తంగా వివరించారు. పిల్లలు డ్రాయింగ్స్, గ్లాస్ పెయింటింగ్, తదితర వస్తువులను ఆమే పరిశీలించి విద్యార్థుల కృషి ఎంతో ఉందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మానవతా సదన్ లో ఉన్న పిల్లలందరికీ జన్మదిన కానుకగా బట్టలను కుట్టిస్తానని, అదేవిధంగా నర్సింగ్ చదివే అమ్మాయిలకు ఫీజులు తదితర ఖర్చులన్నీ భరిస్తానని హామీ ఇచ్చారు.మానవతా సదన్ లో తన జన్మదినాన్ని జరుపుకోవడం సంతోషదాయకమని, తనకు సమయం ఉన్నప్పుడు మానవతా సదన్ ను సందర్శించి పిల్లలకు కావాల్సిన సహాయ సహకారాలన్నీ అందిస్తానని ఆమె అన్నారు. మానవతా సదన్ పిల్లలతో కలిసి సహపంక్తి భోజనం చేశారు.ఈ కార్యక్రమంలో నిజామాబాద్ రూరల్ టిఆర్ఎస్ యూత్ అధ్యక్షులు ఆమీర్ ఖాన్, నవీపేట యూత్ ప్రెసిడెంట్ సాయి కుమార్ గౌడ్, ఆయేషా ట్రస్ట్ యూత్ ప్రతినిధి ముబీన్, జుబేర్, ఉమర్ ఫారుక్ , అజీజ్ ఖాన్, ఇమ్రాన్, టిల్లు, ఫసి, నాగపూర్ ఉపసర్పంచ్ శ్రీకాంత్ రెడ్డి,సంతోష్,ప్రవీణ్ తోపాటు తదితరులు పాల్గొన్నారు.