నయా జోనర్‌లో నాని నయా సినిమా

In a new genre Nani is a new movieహీరో నాని, ‘అంటే సుందరానికీ’ చిత్ర దర్శకుడు వివేక్‌ ఆత్రేయతో మరో సినిమాకి రెడీ అవుతున్నారు. ఇది నాని నటించబోయే 31వ చిత్రం. దీన్ని డివివి ఎంటర్‌టైన్‌ మెంట్స్‌పై డివివి దానయ్య, కళ్యాణ్‌ దాసరి నిర్మించనున్నారు. ఇందులో నానికి జోడిగా ప్రియాంక అరుళ్‌ మోహన్‌ నటిస్తున్నారు. ‘అంటే సుందరానికీ..’తో ఎంటర్‌టైన్‌ చేసిన నాని, వివేక్‌ ఆత్రేయ ద్వయం ఈసారి డిఫరెంట్‌ జోనర్‌ని ఎక్స్‌ఫ్లోర్‌ చేయబోతున్నారని శనివారం విడుదలైన అనౌన్స్‌మెంట్‌ వీడియోలో స్పష్టం చేస్తోంది. చివర్లో మేకర్స్‌ ఎగ్జైటింగ్‌ అప్డేట్‌ కూడా ఇచ్చారు. ఈనెల 23న టైటిల్‌ని రివీల్‌ చేసి, 24న గ్రాండ్‌గా సినిమాని లాంచ్‌ చేయనున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని
వివరాలను మేకర్స్‌ త్వరలోనే తెలియజేయనున్నారు.