నవతెలంగాణ – భువనగిరి: యువజన కాంగ్రెస్ భువనగిరి యాదాద్రి భువనగిరి జిల్లా ప్రధాకార్యదర్శిగా నరముల నవీన్ యాదవ్ నియామకం ఈ రోజు రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు శివ సేన రెడ్డి చేతుల మీదుగా నియామక పాత్రని అందుకోవడం జరిగింది.ఇట్టి నియామకం పై నవీన్ యాదవ్ మాట్లాడుతూ నేను యువజన కాంగ్రెస్ 2020లో జరిగిన ఎన్నికలలో పోటీ చేసి భువనగిరి అసెంబ్లీ కమిటీలో ప్రధాన కార్యదర్శిగా గెలుపొందాను. అప్పటి నుండి యువజన కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీ పిలుపు ఇచ్చిన ప్రతి కార్యక్రమంలో చురుకుగా పాల్గొని పార్టీ కోసం అహర్నిశలు కృషి చేశాను. నా పని తీరును చూసి జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియమించిన యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు శివసేన రెడ్డి, ముచ్యల మనోజ్ యాదవ్, జిల్లా అధ్యక్షులు బర్రె నరేష్ లకు కృతజ్ఞతలు తెలియజేశారు.