స్వతంత్ర అభ్యర్థిగా మరొక సెట్ నామినేషన్ పత్రాలు సమర్పించిన నరసయ్య.

నవతెలంగాణ- తుంగతుర్తి: తుంగతుర్తి అసెంబ్లీ నియోజకవర్గ స్థానానికి మంగళవారం రోజు నాలుగు సెట్ల నామినేషన్ పత్రాలు దాఖలైనట్లు తుంగతుర్తి నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జిల్లా అడిషనల్ కలెక్టర్ వెంకట్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు నియోజకవర్గ కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయంలో మాట్లాడుతూ గుడిపాటి నరసయ్య కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఒక నామినేషన్, స్వతంత్ర అభ్యర్థిగా మరొక సెట్ నామినేషన్ పత్రాలను దాఖలు చేసినట్లు తెలిపారు. అదేవిధంగా ఈదుల వీరపాపయ్య, దేవరకొండ జానయ్యలు చెరొక సెట్ నామినేషన్ పత్రాలు సమర్పించారు. దీంతో మొత్తం ఈరోజు నాలుగు సెట్ ల నామినేషన్ పత్రాలు దాఖలైనట్లు రిటర్నింగ్ అధికారి తెలిపారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి యాదగిరి రెడ్డి, డిప్యూటీ తాసిల్దార్ హరిచంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.