రామారెడ్డి ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ గా నారాయణ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ప్రిన్సిపాల్ గా పని చేసిన మధు శ్రీవాత్సవ దౌల్తాబాద్ జూనియర్ కళాశాలకు బదిలీపై ప్రిన్సిపాల్ గా వెళ్ళగా, ఆయన స్థానంలో ఐలాపూర్ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ గా పని చేసిన నారాయణ బాధితులు స్వీకరించగా, అధ్యాపకులు ఆయనకు శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ.. కళాశాలను అన్ని రంగాల్లో ముందు ఉంచుతామని, కళాశాల ఉన్నతి కోసం తోడ్పాటు అందిస్తామని అన్నారు. కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.