నవతెలంగాణ-మిర్యాలగూడ
కాంగ్రెస్ పట్టణ జనరల్ సెక్రెటరీగా నీరుకంటి నారాయణను నియమిస్తూ ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు శంకర్‌నాయక్ ఎన్నికపత్రం అందజేశారు.ఆదివారం స్థానిక రాజీవ్ భవన్‌లో కాంగ్రెస్ మైనార్టీ సెల్ జిల్లా చైర్మెన్ ఎం ఏ సలీం, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తలకొప్పుల సైదులు చేతుల మీదుగా ఎన్నికున్న ధృవీకరణపత్రం అందజేశారు.ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ కాంగ్రెస్ బలోపేతం కోసం కషి చేస్తానన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు కోసం శాయశక్తులా పని చేస్తానన్నారు.ఆయన ఎన్నిక పట్ల పలువురు కాంగ్రెస్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు.