నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్ పదో తరగతి ఫలితాల్లో నారాయణ విద్యాసంస్థల జైత్రయాత్ర కొనసాగింది. 2023-24 ఫలితాల్లో ఎప్పటిలాగే ఆ సంస్థ విద్యార్థులు తమ ప్రతిభతో మెప్పించారు. నారాయణ విద్యార్థి సాయి మనస్వి ఎస్‌ఎస్‌సీ చరిత్రలోనే 599 అత్యధిక మార్కులతో రికార్డు నెలకొల్పింది. 598, 597 మార్కులతో ఆ తర్వాత ర్యాంకులను కూడా సంస్థ దక్కించుకుంది. గణితం సబ్జెక్ట్‌లో 100కు 100 శాతం మార్కులను 15.3 శాతం విద్యార్థులు సాధించినట్టు నారాయణ విద్యా సంస్థల మేనేజింగ్ డైరెక్టర్లు డాక్టర్ పి.సింధూర నారాయణ, పి.శరణి నారాయణ తెలిపారు. 64 శాతం బ్రాంచీలలో 100 శాతం పాస్ పర్సెంటేజ్ సాధించినట్టు వివరించారు. ఏటేటా నారాయణ విద్యాసంస్థలు తమ ఫలితాలను తామే అధిగమిస్తున్నాయని వారు గుర్తు చేశారు. గ్రేడ్ పాయింట్ నుంచి మార్కుల వరకు అన్నింటా తమ సంస్థ అత్యుత్త ఫలితాలను సాధిస్తున్నదని పేర్కొన్నారు. పటిష్ట ప్రణాళిక, ఉపాధ్యాయుల అంకుఠిత దీక్షకు ఈ పలితాలు నిదర్శనమని తెలిపారు. సీవో, స్పార్క్, ఒలంపియాడ్, మెడి స్పార్క్ తదితర అత్యుత్తమ విధానాలతో భోధన చేయడం వల్లే తమ విద్యార్థులు అన్నింటా ముందు వరుసలో నిలుస్తున్నారని కొనియాడారు. ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు, సిబ్బందికి ఈ సందర్భంగా వారు అభినందనలు తెలిపారు.