జన్నత్‌ హుస్సేన్‌ మరణం పట్ల నారాయణ సంతాపం

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన జన్నత్‌ హుస్సేన్‌ మరణం పట్ల సీపీఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ సంతాపం తెలిపారు. ఆయన వివిధ జిల్లాల్లో అధికారిగా పలు బాధ్యతలను నిర్వహించారని శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉమ్మడి ఏపీ మాజీ సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి వద్ద సీఎస్‌గా పనిచేశారని తెలిపారు. వామపక్ష పార్టీలపై గౌరవభావంతో ఉండేవారని పేర్కొన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.