నారాయణ ఈ టెక్నో స్కూల్ గణేష్ నిమజ్జనం 

Narayana This Techno School Ganesh Nimjanamనవతెలంగాణ – కంఠేశ్వర్ 
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నారాయణ ఈ టెక్నో స్కూల్లో గణేష్ నిమజ్జన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. నిమజ్జన కార్యక్రమంలో భాగంగా నారాయణ పాఠశాల ఏజీఎం శివాజీ గణేష్ విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తమ పాఠశాలలో గణేష్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం వలన విగ్నేశ్వరుని చరిత్రను విద్యార్థులు తెలుసుకుంటారని అందుకు అనుగుణంగా ఆ దిశగా విద్యార్థులకు ప్రోత్సహిస్తూ ముందుకు వెళ్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో నారాయణ పాఠశాల జిఎం గోపాల్ రెడ్డి, ప్రిన్సిపాల్ జ్యోతి, ఏడి అరుణ్, వీపీలు అక్షిత, అనిల్, తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.