సైలని బాబా దర్గా ను సందర్శించిన నారాయణఖేడ్ ఎమ్మెల్యే

నవతెలంగాణ –  రెంజల్

రెంజల్ మండలం నీలా గ్రామ శివారులోనున్న సైలని బాబా దర్గాను నారాయణఖేడ్ ఎమ్మెల్యే పట్లోళ్ల సంజీవరెడ్డి బుధవారం రాత్రి సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయంలో తాను ఈ దర్గాను సందర్శించలేకపోయానని, సైలని బాబా అధినేత వహీద్ బాబా తనకోసం ప్రత్యేక ప్రార్థనలను చేయడం వల్లనే తాను గెలుపొందాలని ఆయన పేర్కొన్నారు. సైలని బాబా ఆశీర్వాదం వల్లే తాను ఈరోజు ఎమ్మెల్యేగా గెలుపొందాలని ప్రజలకు మరిన్ని సేవలను అందించే విధంగా ఆశీర్వదించాలని ఆయన అన్నారు. సైలని బాబా దర్గాకు చాదర్ పూలమాలలు వేసి ప్రత్యేక ప్రార్థనలను చేశారు. ఆయన వెంట సైలని బాబా నిర్వాహకులు ఆయన అనుచరులు పాల్గొన్నారు.