నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ఇంటర్ ఫలితాల్లో అత్యుత్తమ మార్కులతో నారాయణ విద్యాసంస్థల విద్యార్థులు ఆల్‌టైమ్ రికార్డును సృష్టించారు. ఈ మేరకు నారాయణ విద్యాసంస్థల మేనేజింగ్ డైరెక్టర్లు పి సింధూర నారాయణ, శరణి నారాయణ బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఇంటర్ ప్రథమ సంవత్సరం ఎంపీసీ విభాగంలో 469 మార్కులతో స్టేట్ టాప్ మార్కులు సాధించామని తెలిపారు. ద్వితీయ సంవత్సరం ఎంపీసీ విభాగంలో 993 మార్కులను ముగ్గురు విద్యార్థులు సాధించారని పేర్కొన్నారు. ప్రథమ సంవత్సరం బైపీసీ విభాగంలో 438 మార్కులను ఆరుగురు విద్యార్థులు పొందారని తెలిపారు. ద్వితీయ సంవత్సరం బైపీసీలో 994 మార్కులను నారాయణ విద్యార్థులే కైవసం చేసుకున్నారని వివరించారు. 470కిగాను 469 మార్కులతో పులిగిళ్ల జాహ్నవి చరిత్ర సృష్టించారని తెలిపారు. 468 మార్కులతో 74 మంది, 467 మార్కులను 530 మంది, 466 మార్కులను 1,102 మంది విద్యార్థులు సాధించారని పేర్కొన్నారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఎంపీసీ విభాగంలో వెయ్యికిగాను 993 మార్కులను ముగ్గురు విద్యార్థులు పొందారని తెలిపారు. 992 మార్కులను పది మంది, 991 మార్కులను 29 మంది, 990 మార్కులను 51 మంది విద్యార్థులు సాధించారని పేర్కొన్నారు. ప్రథమ సంవత్సరం బైపీసీ విభాగంలో 440కి గాను 438 మార్కులను ఆరుగురు విద్యార్థులు పొందారని తెలిపారు. 437 మార్కులను 32 మంది, 436 మార్కులను 40 మంది, 435 మార్కులను 44 మంది విద్యార్థులు సాధించారని వివరించారు.